Saturday, February 10, 2018

ఇదీ.. ఓం నమఃశివాయ మంత్ర శక్తి

మహా శివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది. శివనామ స్మరణతో ఆలయప్రాంగణాలు, ఇళ్లు మారుమోగాలి. పంచాక్షరీ మంత్రంతో శివ నామస్మరణను మొదలు పెడదాం. ఈ పంచాక్షరీ మంత్రాన్ని ధ్యానానికి అనుకూలంగా రూపొందించాం.
ఈ మంత్రోచ్ఛారణ ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలిగిస్తుంది. స్ట్రెస్,చిరాకులు, కోపతాపాలు, ఏవైనా చిన్నచిన్న గొడవలు ఉంటే వాటికి ఇంగ్లీష్ లో మందులు లేవు. మన ఆధ్యాత్మిక చింతనలో మాత్రం "మంత్రం” అనే మందుంది. వాటిలో శ్రేష్టమైన మంత్రాల్లో ఒకటి "ఓం నమఃశివాయ" పంచాక్షరీ మంత్రం. రోజూ ఈ మంత్రాన్ని వినండి.. ప్రశాంతత ఉంటే సగం రోగాలు తగ్గుతాయి, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మహాశివరాత్రి ముందస్తు శుభాకాంక్షలతో ఓం నమఃశివాయ...
 and SUBSCRIBE our Complete Devotional Channel.

Tuesday, February 6, 2018

గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఎక్కడ ఉంది?

గాయత్రి మంత్రాన్ని మనకి అందించిన బ్రహ్మర్షి ఎవరు? గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఎక్కడ ఉంది? గాయత్రి అర్థమేంటి? ఆ మంత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది? 108 సార్లు గాయత్రి మంత్ర జపంతో ఉన్న ఈ వీడియోలో పై వివరాలన్నీ ఉన్నాయి. గాయత్రి మంత్రం గురించి తెలుసుకుని జపం చేస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా చూడండి... ప్రశాంతతను ఇచ్చే గాయత్రి మంత్రం వినండి. మా Complete Deviotional Channel ఛానెల్ ను SUBSCRIBE చేయండి.

Monday, February 5, 2018

శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం ‍‍!!! శంభో శంకరా...

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలం. అతి పురాతన క్షేత్రాల్లో కూడా శ్రీశైలం ఒకటి. శ్రీశైల బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి సందర్భంగా మే ప్రత్యేకంగా విభిన్నంగా రాసి, రూపొందించిన ఈ శివగీతాన్ని వినండి.. మేం ఈ ఛానెల్ ను పూర్తి ఆధ్యాత్మిక, భక్తి ఛానెల్ గా నిర్వహిస్తున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన మరెన్నో విషయాలను, వాస్తవాలను, హిందూ ధర్మాలను, పిల్లల శ్లోకాలను ప్రచారం చేసేందుకు వర్క్ చేస్తున్నాం. మన పిల్లలకు ఇంగ్లీష్ చదువులే కాదు, మన సంప్రదాయాలు కూడా వారసత్వంగా అందించాలి. అదే మా ప్రయత్నం. మాకు కావాల్సింది మీ ఆదరాభిమానాలు వాటితో పాటు మీ SUBSCRIPTION. మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేయండి. మరెన్నో భక్తి, ఆధ్యాత్మిక విశేషాలను ఫాలో కండి. ధన్యవాదాలు.


మంత్రానికి శక్తి ఉందా ?

ప్రాతఃకాలంలో ఉత్తిష్ఠంతు భూత పిశాచాః అని నెగటివ్ ఎనర్జీని ఇంటి నుంచి బయటకు పంపించాలన్నా.. సంధ్యా సమయంలో మళ్లీ ఆ నెగటివ్ ఎనర్జీస్ మన ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా.. వాటికో శక్తి కావాలి. ఆ నెగటివ్ వైబ్రేషన్ తో యుద్ధం చేసే శక్తి ఒక్క మంత్రానికే ఉంది. అందునా ఆ శక్తి ఎక్కువగా ఉండే అమ్మవారి మంత్రాలు, స్తోత్రాలకే. వాటిలో ముఖ్యమైనవి లలితా, లక్ష్మీ స్తోత్రాలు. ఈ మహాలక్ష్మి అష్టకం.. సకల శుభాలకూ మూలం. లక్ష్మీదాయకం. ఈ అష్టకాన్ని రోజూ వినండి...



Friday, January 26, 2018

మన ఋషుల కాస్మిక్ వండర్ 108

108 సంఖ్య ప్రాధాన్యత
సూర్యుడికీ భూమికీ ఉన్న దూరం, చంద్రుడికీ భూమికీ ఉన్న దూరం, భూభ్రమణ విధానం, దానికున్న ప్రభావం – వీటన్నిటినీ శ్రద్ధగా మన ఋషులు పరిశీలించారు. సూర్యుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. అట్లాగే చంద్రుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే చంద్రుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. అందుకే మనం హారంలో 108 పూసలు గుచ్చుతాం. మీరు ఆరోగ్యంగా ఉంటే నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తారు. మీరెంతో సాధన చేస్తే అది 12 కు వస్తుంది. నిమిషానికి 15 సార్లు శ్వాస అంటే గంటకు 900 సార్లు, రోజుకు 21,600 సార్లు. భూమధ్యరేఖ వద్ద భూమి చుట్టుకొలత 21,600 నాటికల్ మైళ్లు – మీరు రోజుకు శ్వాస తీసుకునే పర్యాయాల సంఖ్యకూడా అదే. అంటే భూగోళం తన చుట్టూ తాను సమయం ప్రకారం పరిభ్రమిస్తూ ఉంటేనే మీరు బాగుంటారు. కాని భూపరిభ్రమణం సమయం తప్పితే మన పరిస్థితి అధోగతి. మీరు దానికి అనుగుణంగా లేకపోయినా అది మీకు మంచిదికాదు. 21,600ని 2తో భాగిస్తే 10,800. ఈ సంఖ్యను వందతో భాగిస్తే 108. ఇలా 108తో మన ఋషులు కాస్మిక్ సైన్స్ థియరీనే తయారు చేశారు. సూర్యచంద్రులు స్థిరంగా ఉంటేనే భూమికి మనుగడ.. వాటి మధ్య దూరాలకు 108 ఉన్న ప్రగాఢ సంబంధమే మన ఆధ్యాత్మికతలో భాగమైంది.



Saturday, January 20, 2018

వసంత పంచమి అంటే?

ఈ సోమవారం అద్భుతమైన పర్వదినం. పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన "వసంత పంచమి". ఈ రోజున సరస్వతి దేవిని విధిగా ఆరాధించాలని దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణాలు చెప్తున్నాయి. వసంత పంచమి నాడు సరస్వతిని సువాసనలు వెదజల్లే ఏవైనా తెల్లని పూలు, అక్షతలతో పూజించాలి. పాయసాన్ని ప్రత్యేక ప్రసాదంగా నివేదిస్తారు. పిల్లలకు అత్యంత ముఖ్యమైన రోజు. అందుకే ఈ శ్లోకాన్ని పిల్లలతో తప్పనిసరిగా పఠింపచేయండి. విద్యాబుద్ధులు, తెలివితేటలు సమృద్ధిగా లభిస్తాయి.

Friday, January 19, 2018

ఈ శనివారం వరద చతుర్థి

ఈ శనివారం వరద చతుర్థి. ప్రదోష కాలంలో చవితి ఉంటే వరద చతుర్థి ఆచరించాలని స్కాంద పురాణం చెప్తోంది. ఉండాలనుకున్నవాళ్లు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం గణపతిని పూజిస్తారు. లేదా నువ్వుల నూనె దీపంతో ఆ విఘ్ననాథుడిని సాయంత్రం పూజించినా మంచిదే. ఢూంఢీ గణపతి పూజలు ఈ వరద చతుర్ధి నాడు బాగా జరుగుతాయి. ఈ రోజుని కుంద చతుర్థి అని కూడా అంటారు. శివుని మల్లెపూలతో పూజిస్తే సౌభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే మహా గణపతిని మనసా స్మరించే ఈ కీర్తనను మీరూ వినండి.

Thursday, January 11, 2018

వివేకానంద 155వ జయంతి

వివేకానంద 155వ జయంతి. యువజన దినోత్సవం. ఆయన సందేశాన్ని యువత తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి. ఆయన ఆశయాలతో రూపొందించిన గీతమిది...