Friday, January 26, 2018

మన ఋషుల కాస్మిక్ వండర్ 108

108 సంఖ్య ప్రాధాన్యత
సూర్యుడికీ భూమికీ ఉన్న దూరం, చంద్రుడికీ భూమికీ ఉన్న దూరం, భూభ్రమణ విధానం, దానికున్న ప్రభావం – వీటన్నిటినీ శ్రద్ధగా మన ఋషులు పరిశీలించారు. సూర్యుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. అట్లాగే చంద్రుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే చంద్రుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. అందుకే మనం హారంలో 108 పూసలు గుచ్చుతాం. మీరు ఆరోగ్యంగా ఉంటే నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తారు. మీరెంతో సాధన చేస్తే అది 12 కు వస్తుంది. నిమిషానికి 15 సార్లు శ్వాస అంటే గంటకు 900 సార్లు, రోజుకు 21,600 సార్లు. భూమధ్యరేఖ వద్ద భూమి చుట్టుకొలత 21,600 నాటికల్ మైళ్లు – మీరు రోజుకు శ్వాస తీసుకునే పర్యాయాల సంఖ్యకూడా అదే. అంటే భూగోళం తన చుట్టూ తాను సమయం ప్రకారం పరిభ్రమిస్తూ ఉంటేనే మీరు బాగుంటారు. కాని భూపరిభ్రమణం సమయం తప్పితే మన పరిస్థితి అధోగతి. మీరు దానికి అనుగుణంగా లేకపోయినా అది మీకు మంచిదికాదు. 21,600ని 2తో భాగిస్తే 10,800. ఈ సంఖ్యను వందతో భాగిస్తే 108. ఇలా 108తో మన ఋషులు కాస్మిక్ సైన్స్ థియరీనే తయారు చేశారు. సూర్యచంద్రులు స్థిరంగా ఉంటేనే భూమికి మనుగడ.. వాటి మధ్య దూరాలకు 108 ఉన్న ప్రగాఢ సంబంధమే మన ఆధ్యాత్మికతలో భాగమైంది.



Saturday, January 20, 2018

వసంత పంచమి అంటే?

ఈ సోమవారం అద్భుతమైన పర్వదినం. పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన "వసంత పంచమి". ఈ రోజున సరస్వతి దేవిని విధిగా ఆరాధించాలని దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణాలు చెప్తున్నాయి. వసంత పంచమి నాడు సరస్వతిని సువాసనలు వెదజల్లే ఏవైనా తెల్లని పూలు, అక్షతలతో పూజించాలి. పాయసాన్ని ప్రత్యేక ప్రసాదంగా నివేదిస్తారు. పిల్లలకు అత్యంత ముఖ్యమైన రోజు. అందుకే ఈ శ్లోకాన్ని పిల్లలతో తప్పనిసరిగా పఠింపచేయండి. విద్యాబుద్ధులు, తెలివితేటలు సమృద్ధిగా లభిస్తాయి.

Friday, January 19, 2018

ఈ శనివారం వరద చతుర్థి

ఈ శనివారం వరద చతుర్థి. ప్రదోష కాలంలో చవితి ఉంటే వరద చతుర్థి ఆచరించాలని స్కాంద పురాణం చెప్తోంది. ఉండాలనుకున్నవాళ్లు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం గణపతిని పూజిస్తారు. లేదా నువ్వుల నూనె దీపంతో ఆ విఘ్ననాథుడిని సాయంత్రం పూజించినా మంచిదే. ఢూంఢీ గణపతి పూజలు ఈ వరద చతుర్ధి నాడు బాగా జరుగుతాయి. ఈ రోజుని కుంద చతుర్థి అని కూడా అంటారు. శివుని మల్లెపూలతో పూజిస్తే సౌభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే మహా గణపతిని మనసా స్మరించే ఈ కీర్తనను మీరూ వినండి.

Thursday, January 11, 2018

వివేకానంద 155వ జయంతి

వివేకానంద 155వ జయంతి. యువజన దినోత్సవం. ఆయన సందేశాన్ని యువత తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి. ఆయన ఆశయాలతో రూపొందించిన గీతమిది...